హీరోగా వివి వినాయ‌క్.. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి..!

vv vinayak as hero

మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుండ‌గా, అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ట‌. మొద‌టి షెడ్యూల్ త‌ర్వాత జ‌రిగే షెడ్యూల్‌కి వినాయ‌క్ చాలా గ్యాప్ తీసుకుంటాడ‌ట‌. ప్ర‌స్తుతం ఉన్న ఫిజిక్‌తో మొద‌టి షెడ్యూల్‌ని మొద‌లు పెట్ట‌నున్నారు. వినాయ‌క్ కాస్త స‌న్న‌బ‌డ్డ త‌ర్వాత రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయ‌నున్నారు. షూటింగ్ గ్యాప్ లో వినాయక్ తగిన జాగ్రత్తలు తీసుకొని త‌న బాడీని త‌గ్గించుకోనున్నార‌ట‌. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ సినిమాని దర్శకుడు శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌. నరసింహారావు తెర‌కెక్కించ‌నున్నారు. గ‌తంలో ఈయ‌న శ‌ర‌భ అనే సినిమా తీసారు. వినాయక్ 2018లో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ఇంటెలిజెంట్ అనే చిత్రానికి చివ‌రిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే . ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ ల‌భించింది.