పెళ్లికాకుండానే తల్లినయ్యా…అయితే ఇప్పుడేంటి ?

Become a mother without getting married

బాలీవుడ్ నటి మహిగిల్ సంచలన ప్రకటన చేసింది. ఇంకా పెళ్లి కాని ఈ భామ తనకు వెరోనికా అనే కూతురు ఉందని ఆమె తనకు పుట్టిన బిడ్డే అని ఆమెకు వచ్చే నెలలో తన బిడ్డకు రెండేళ్లు నిండుతాయని చెప్పింది. తాను ఇంత వరకు పెళ్లి చేసుకోలేదని కానీ రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపింది. ఒక కూతురుకు తల్లినైనందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటానని ఆమె పెర్కొనది. తాజాగా ఆమె ఒక  ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని 43 ఏళ్ల మహిగిల్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. మన ఆలోచనలు, సమయాన్ని బట్టి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. పెళ్లి చేసుకోకుండానే కుటుంబం, పిల్లల్ని కలిగిఉండవచ్చని తెలిపింది. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడంలో ఎలాంటి సమస్య లేదని చెప్పింది. పెళ్లి చాలా అద్భుతమైనదని అయితే పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది.