బంగారు కేక్ ని కట్ చేసిన ఊర్వశి..!

బంగారు కేక్ ని కట్ చేసిన ఊర్వశి..!బంగారు కేక్ ని కట్ చేసిన ఊర్వశి..!
Cinema News

బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తుంది . తాజాగా ఊర్వశి రౌటెలా బంగారపు కేక్ కట్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. తన పుట్టినరోజు సందర్భంగా ఊర్వశీ రౌటెలా బంగారపు కేక్ కట్ చేసింది. తన స్నేహితుల సమక్షంలో 24 క్యారెట్ బంగారు పూత పూసిన కేక్ కట్ చేసి ఆమె తన పుట్టినరోజు ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఊర్వశి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Urvashi Rautela

బంగారు కేక్ ని కట్ చేసిన ఊర్వశి..!

ప్రస్తుతం ఊర్వశి రౌటెలా పుట్టినరోజు పిక్స్ వైరల్‌గా మారాయి. దీనిపై కొంతమంది నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తినే కేక్‌పై బంగారు కోటింగ్ అవసరమా.. ?అని , ఇది మరీ ఓవరాక్షన్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అన్నట్టు ఊర్వశి రౌటెలా ఇటు తెలుగు మూవీ ల్లో కూడా ప్రత్యేక పాటల్లో నటిస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే, ఆమెకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉన్నది .