నందమూరి థమన్ మాత్రమే కాదు.. NBK థమన్!

Not just Nandamuri Thaman.. NBK Thaman!
Not just Nandamuri Thaman.. NBK Thaman!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల బొమ్మ గా నిలిచింది. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ లో బాలయ్య పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక మిగతా సంక్రాంతి మూవీ లకు దీటుగా ఈ సినిమా రిజల్ట్ వస్తుండడంతో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

Not just Nandamuri Thaman.. NBK Thaman!
Not just Nandamuri Thaman.. NBK Thaman!

‘డాకు మహారాజ్’ చిత్ర విజయోత్సవ సభలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై నందమూరి బాలకృష్ణ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థమన్ ప్రతిసారి తన మూవీ లకు ఇచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని.. అందుకే అతడిని అందరూ నందమూరి థమన్ అంటారని బాలయ్య అన్నారు. అయితే, ఇకపై అలా అనొద్దని.. NBK థమన్ అని పిలవాలని బాలయ్య గారు కోరారు.

ఇలా బాలయ్య మూవీ లకు అదిరిపోయే స్కోర్ అందిస్తున్న థమన్‌పై బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ఇతర ముఖ్య పాత్రల ల్లో నటిస్తున్నారు .