టీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

application invitation to t seva center

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి టీ-సేవ ఆన్‌లైన్ కేంద్రాల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీ-సేవ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడిస్తూ.. విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆరోగ్యం, వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, బస్సు, రైలు, విమానాల టికెట్ల బుకింగ్ వంటి పలురకాల సేవలను వీటిద్వారా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ నెల 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 8179955744 లేదా ఆన్‌లైన్‌లో www.tsevacentre.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.