ఢిల్లీలో మొదలైన బోనాల సంబురాలు

bonalu celebrations started in delhi

ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో బోనాల సంబురాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బుధ, గురువారాల్లో ఈ వేడుకలు కొనసాగనున్నాయి. 111 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా 111 ఫొటోలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కే కేశవరావు, రంజిత్‌రెడ్డి, పీ రాములు, బీబీ పాటిల్ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ బోనాలు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం, లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయ కమిటీ సంయుక్తంగా ఢిల్లీలో ఐదో సంవత్సరం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.