స్వచ్ఛందంగా సభ్యత్వాల నమోదు

Registration of memberships voluntarily

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు సైతం స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నా రు. ఎక్కడ చూసినా సభ్యత్వ నమోదు కార్యక్ర మం ఉత్సాహంగా సాగుతున్నది. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పంద న లభిస్తుందని పలువురు మంత్రులు పేర్కొన్నారు.