హైదరాబాద్‌లో బోల్తా పడ్డ లగ్జరీ బస్సు

luxury bus fell down in hyderabad

నగరంలోని మొజాంజాహీ మార్కెట్‌ వద్ద ఇవాళ ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న లగ్జరీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఏడుగురి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ప్రయాణికులను వేరే బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.