పోలీస్ కమిషనర్ అవుతున్న ఆరెక్స్ 100 ఇందు

indu becoming as police commissioner

ఆర్ఎక్స్ 100 సినిమాలో ఇందుగా నెగటీవ్ క్యారెక్టర్ లో చెలరేగిపోయి నటించి హీరో కార్తికేయతో సమానమైన పేరు సంపాదించిన పాయల్ రాజపుట్ కి ఆ సినిమా తర్వాత అవకాశాలు వచ్చ్హినా అన్నీ ఒప్పెసుకోకుండా చాల సెలక్టివ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. అమ్మడుకి ఆర్ఎక్స్ 100 తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఆర్ఎక్స్ లాంటి క్యారెక్టర్స్ రావడంతోనే అవకాశాలొచ్చినా సినిమాలు చెయ్యలేదని చెబుతున్న ఈ బ్యూటీ బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీత సినిమాలో ఐటెం సాంగ్ లో ఆడి పాడింది. మరోపక్క పాయల్ హీరోయిన్ గా రవితేజ – వి.వి.ఆనంద్ కాంబోలో తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలోనూ ఒక హీరోయిన్ గా నటిస్తుంది పాయల్ రాజపుట్. ప్రస్తుతం డిస్కోరాజా సెట్స్ మీదుంది. మరి పట్టుమని రెండు సినిమాల అనుభవం కూడా లేని ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకోకుండానే పాయల్ ఇలా ఒక లేడి ఓరియెంటెడ్ చెయ్యడం మాత్రం ఆమెకి కలిసొచ్చే అంశంలా కనబడుతుంది. ప్రనదీప్ అనే దర్శకుడు డైరెక్ట్ చెయ్యబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పాయల్ పోలీస్ కమీషనర్ గా నటించబోతుంది. ఈ మేరకు నిన్న సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లు చేసింది.