శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

Huge gold seized at Shamshabad airport

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంగారాన్ని తరలిస్తున్న 14 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 2.20 కోట్లుగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారుల జాయింట్‌ ఆపరేషన్‌లో జెడ్డా నుంచి వచ్చిన 14 మంది బంగారంతో పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.