క్రికెట్‌కు అంబ‌టి రాయుడు గుడ్‌బై

ambati rayudu good bye for cricket

అంబ‌టి రాయుడు అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఇవాళ రాయుడు తెలిపాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయ‌క‌పోవ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. తన నిర్ణ‌యాన్ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డుకు తెలియ‌జేశాడు. 55 వ‌న్డేలు ఆడిన 1694 ర‌న్స్ చేశాడు. టీ20ల్లో 4626 ర‌న్స్ చేశాడు.