మరో ముద్దు చిత్రం..!

Another Kiss Movie Natakam

ఈమద్య తెలుగు బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాల సందడి కొనసాగుతుంది. భారీ ఎత్తున చిన్న చిత్రాలు విడుదల అవుతున్నాయి. చిన్న చిత్రాల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఈమద్య కాలంలో సక్సెస్‌ అయిన చిన్న చిత్రాల్లో ఎక్కువగా రొమాంటిక్‌ చిత్రాలే అవ్వడం గమనించదగ్గ విషయం. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం నుండి మొన్న వచ్చిన పేపర్‌ బాయ్‌ చిత్రం వరకు పలు చిత్రాల్లో ముద్దు సీన్స్‌ హద్దులు దాటుతూనే ఉన్నాయి. చిన్న చిత్రాలకు ముద్దు సీన్స్‌ శ్రీరామ రక్ష అన్నట్లుగా ఉంది. ఎన్నో చిత్రాల్లో ముద్దు సీన్స్‌ వల్ల మంచి ఫలితం దక్కింది. అందుకే ఇప్పుడు వస్తున్న చిత్రాలు అన్ని కూడా ముద్దు సీన్స్‌పై ఆధారపడి వస్తున్నాయి.

natakam-kiss

ఇటీవలే రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన ‘భైరవగీత’ అనే చిత్రంలో ముద్దు సీన్స్‌ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘నాటకం’. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంలో ముద్దు సీన్స్‌తో లీడ్‌ పెయిర్‌ అలరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమా స్థాయిని పెంచేసింది. తప్పకుండా ఇది ఆకట్టుకుంటుందనే నమ్మకంను కలిగించింది. ముద్దు సీన్స్‌తో యూత్‌ను టార్గెట్‌ చేయబోతున్న ఈ చిత్రం మరో విజయాన్ని ప్రేక్షకులకు తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

natakam-kiss-movie