సాయిపల్లవి పద్దతి కొత్తగా ఉంది

Fidaa Movie Fame Sai Pallavi New Approach In Selection Of Movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు తాజాగా తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాతో సాయి పల్లవి క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగింది. మంచి నటనతో ఆకట్టుకుంటున్న సాయి పల్లవితో సినిమాలు చేసేందుకు కుర్రహీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతలు ఈమె ముందుకు భారీ అడ్వాన్స్‌లు పట్టుకుని వెళ్లారట. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఈ అమ్మడు కమిట్‌ కాలేదు. అందుకు ఈమె చెప్పే కారణం కాస్త విభిన్నంగా, కొత్తగా అనిపిస్తుంది.

సహజంగా అయితే ఒక సినిమా సక్సెస్‌ కాగానే హీరోయిన్స్‌ ఆ వెంటనే వరుసగా సినిమాలను కమిట్‌ అవుతారు. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన దాదాపు అందరు హీరోయిన్స్‌ ఇదే పద్దతిని ఫాలో అయ్యారు. కాని సాయి పల్లవి మాత్రం తాను అలా కాదు అంటుంది. స్టార్‌ హీరో అయినా, కోట్ల పారితోషికం అయినా కూడా ఆచి తూచి అడుగులు వేస్తానంటుంది. డబ్బు తనకు ప్రాధాన్యత కాదు అంటూ చెబుతూనే, మంచి పాత్రలు మాత్రమే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మరోసారి భానుమతి వంటి పాత్రను మాత్రమే చేస్తాను అని, అప్పటి వరకు ఎదురు చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో సాయి పల్లవి రెండవ సినిమా కూడా దిల్‌రాజు బ్యానర్‌లోనే ఉండే అవకాశం ఉంది. మంచి పాత్ర అనిపించినప్పుడే చేయమని, ఇష్టం అయితేనే చేయవచ్చు అంటూ నిర్మాత దిల్‌రాజు ఆమెను లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సాయి పల్లవి తెలుగు నిర్మాతలకు కొత్తగా అనిపిస్తుంది. ఈమె ఎప్పటికి ఇలాగే ఉంటుందా లేదా మారుతుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

ట్విట్టర్‌లో నాగ్‌, ఎన్టీఆర్‌ల ‘బిగ్‌బాస్‌’ చర్చ