ఛార్మి విచారణకు సహకరించలేదు

Charmy Kaur not supported for offecers in drugs case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్‌ కేసులో నిన్న సిట్‌ ముందు విచారణకు హాజరు అయిన హీరోయిన్‌ ఛార్మి అధికారులను విసిగించినట్లుగా తెలుస్తోంది. ఆమెను సిట్‌ అధికారులు పలు విషయాలను ప్రశ్నించారు. కెల్విన్‌తో సంబంధం ఏంటి, పూరితో ఉన్న రిలేషన్‌ ఏంటి, డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందా, విదేశాలకు ఎందుకు వెళ్తారు, ఎక్కువ గోవాకు వెళ్లడంకు గల కారణం ఏంటి అంటూ పలు ప్రశ్నలను సిట్‌ అధికారులు ఛార్మిపై సంధించారు. ఏ ప్రశ్నకు కూడా ఛార్మి సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ఆమె కాస్త అతి చేసినట్లుగా కూడా సిట్‌ అధికారుల నుండి అనధికారిక సమాచారం అందుతుంది. 

పలు ప్రశ్నలకు అది తన వ్యక్తిగత విషయం అని, తాను తన వ్యక్తిగత విషయాలను వెళ్లడి చేయను అంటూ సిట్‌ అధికారుల ప్రశ్నలను దాట వేసినట్లుగా చెబుతున్నారు. సిట్‌ అధికారులు ఎక్కువగా ఆమె డ్రగ్స్‌ తీసుకుందా, ఆ డ్రగ్స్‌ ఎక్కడ నుండి వచ్చేవి, కెల్విన్‌ ఎవరు, ఎవరి ద్వారా పరిచయం అనే ప్రశ్నలను సంధించే ప్రయత్నం చేశారు. కాని వేటికి కూడా ఆమె సరైన సమాధానాలు మాత్రం చెప్పలేదని, ఆమె లాయర్‌ ఆమెను బాగా ట్రైనింగ్‌ చేసి పంపిచినట్లుగా అనిపించిందని, కొన్ని సందర్బాల్లో తనకు ప్రశ్న అర్థం కాలేదు అంటూ హిందీలో మాట్లాడినది అంటూ సిట్‌ అధికారలు అంటున్నారు. మరోసారి ఛార్మిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. నేడు సిట్‌ ముందుకు ముమైత్‌ ఖాన్‌ విచారణకు వెళ్లబోతున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు:

ఆత్మహత్యకు ప్రయత్నం.. అందుకే బయటకు

 ట్రైలర్‌, టీజర్‌.. ఇప్పుడు స్టంపర్‌

అప్పుడు డ్రగ్స్‌ ఆరోపణలు బండ్ల.. ఇప్పుడు మద్దతు