నేడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సహా దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు కూడా తనకి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు. ఇక మరో పక్క ప్రభాస్ నటిస్తున్న భారీ మూవీ లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఒక పక్క మారుతీ మూవీ మరో పక్క దర్శకుడు హను రాఘవపూడి మూవీ లని ఏకకాలంలో డార్లింగ్ తన డెడికేషన్ తో గ్యాప్ లేకుండా చేసేస్తున్నారు .
ఇక ఇదిలా ఉండగా ఇపుడు ప్రభాస్, హను ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుస్తుంది. కొన్ని రోజులు కితమే చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకోగా ఇపుడు నెక్స్ట్ షెడ్యూల్ ఈ అక్టోబర్ 25 నుంచి మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది . అలాగే హైదరాబాద్ లో అయితే ఈ షూటింగ్ భారీ సెట్స్ నడుమ తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది . ఇక ఈ మూవీ లో ప్రభాస్ సరసన యువ నటి ఇమాన్వి నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.