అప్పుడు డ్రగ్స్‌ ఆరోపణలు బండ్ల.. ఇప్పుడు మద్దతు

Bandla Ganesh responds over Puri Jagannath's drugs issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దర్శకుడు పూరి జగన్నాధ్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని, దాంతో పాటు టాలీవుడ్‌లో ఎంతో మందికి డ్రగ్స్‌ను అతనే అలవాటు చేశాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాలో పూరిపై దుమ్మెత్తి పోస్తున్నారు. పూరి పదే పదే మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఆయనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆయనకు సినీ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు పూరి జగన్నాథ్‌కు మద్దతుగా మాట్లాడటం జరిగింది. తాజాగా నిర్మాత బండ్ల గణేష్‌ కూడా దర్శకుడు పూరికి మద్దతు పలికాడు. 

కొన్ని నెలల క్రితం బండ్ల గణేష్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన దురదృష్టం కొద్ది డ్రగ్స్‌ తీసుకుని, అర్థరాత్రి వరకు మద్యం తాగే ఒక దర్శకుడితో సినిమాు నిర్మించాను. అతడితో సినిమా అంటే నాకు పరమ చిరాకు ఎత్తింది అంటూ బండ్ల గణేష్‌ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అంతా కూడా దర్శకుడు పూరినే బండ్ల గణేష్‌ టార్గెట్‌ చేశాడు అని అనుకున్నారు. బండ్ల గణేష్‌ చేసిందే కొన్ని సినిమాలు ఆ దర్శకుల్లో పూరికే అలాంటి పేరు ఉంది. కనుక బండ్ల గణేష్‌ విమర్శలు చేసింది పూరి గురించే అని అంతా భావించారు. కాని ఇప్పుడు మాత్రం బండ్ల గణేష్‌ మాట్లాడుతూ పూరి చాలా మంచి వాడు, ఆయనకు డ్రగ్స్‌ అలవాటు లేదు, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు అంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

మరిన్ని వార్తలు:

ఛార్మి ముందు ఉంచే ప్రశ్నలు ఇవే

‘గౌతమ్‌నంద’కు ఆమె అందాలు ప్లస్‌

వై.వి.ఎస్ చౌదరి గొంతు లేచింది.