‘గౌతమ్‌నంద’కు ఆమె అందాలు ప్లస్‌

catherine tresa in gautham nanda movie looking beautiful

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమ్‌నంద’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ సినిమాను సంపత్‌ నంది భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా ట్రైలర్‌ మరియు పోస్టర్స్‌ను చూస్తుంటేనే అనిపిస్తుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో విడుదలకు ముందే సినిమా అన్ని ఏరియాల్లో మంచి రేటుకు అమ్ముడు పోయింది. నిర్మాతకు ఇప్పటికే లాభాలు తెచ్చి పెట్టిన ఈ సినిమా విడుదల తర్వాత మరిన్ని లాభాలను దక్కించుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలో కేథరిన్‌ తెర్సా అందాలు సినిమాకు ప్లస్‌ అవుతాయంటున్నారు. 

ఈ చిత్రంలో గోపీచంద్‌కు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు హన్సిక మరియు కేథరిన్‌ తెర్సాలు నటించారు. ఇద్దరు కూడా పోటీ పడి మరీ మాస్‌ ఆడియన్స్‌ కోసం అందాల ప్రదర్శణ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కేథరిన్‌ తెర్సా బికినీ ట్రీట్‌తో ప్రేక్షకులు అదిరిపోతారు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఇటీవల కేథరిన్‌ తెర్సా మాట్లాడుతూ ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎప్పుడు ఇంత గ్లామర్‌గా నటించలేదు అని చెప్పిన విషయం తెల్సిందే. అంటే ఈమె ఈ సినిమాలో ఏ స్థాయిలో అందాల ప్రదర్శణ చేసిందో చెప్పుకోవచ్చు. గోపీచంద్‌ సినిమా సక్సెస్‌ కాక చాలా సంవత్సరాలు అయ్యింది. మరి ఈ సినిమా అయినా సక్సెస్‌ అవుతుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

హై కోర్టులో ఛార్మికి షాక్‌.. ఇక ఆమెకు తప్పదు

జైలవకుశ ఆడియో, రిలీజ్ డేట్స్ వచ్చేసాయి.

హై కోర్టులో ఛార్మికి షాక్‌.. ఇక ఆమెకు తప్పదు

‘గౌతమ్‌నంద’కు ఆమె అందాలు ప్లస్‌ - Telugu Bullet