విధేయ రాముడి జాబితాలో కేథరిన్ కూడా చేరింది

Catherine Tresa In Vinaya Vidheya Rama Movie

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, అల్లు ఆర్జున్ కాంబినేషన్ లో వచ్చినా చిత్రం సరైనోడు లో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు గా కేథరిన్ ను కూడా నటించిన సంగతి తెలిసిందే. ఓ యువ MLA గా నటించి అలరించింది. అల్లు ఆర్జున్ ఆమెతో యు అర్ మై mla అంటు ఓ సాంగ్ ను కూడా పాడుకున్నాడు. ఈ చిత్రం బన్నీ, బోయపాటి శ్రీను కెరీర్ లో సూపర్ హిట్ట్ చిత్రం గా నిలిచింది. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో వచ్చినా జయ జానకి నాయక చిత్రలో బెల్లం కొండ సురేష్ తో ఓ ఐటమ్ సాంగ్ లో ఆడి పాడింది. ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి చిత్రం వినయ విధేయ రామ చిత్రం లో ఓ స్పెషల్ సాంగ్ కోసం కేథరిన్ ను తీసుకుంటున్నారు.

Boyapati Not Leaving Catherine

దేవి శ్రీ ప్రసాద్ కూడా తన డ్రమ్స్ తో సిద్ధం గా ఉన్నాడు. త్వరలోనే చిత్రీకరణ కు వెళ్లబోతున్నారు. రామ్ చరణ్ నిర్మాత గా చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినా చిత్రం ఖైది నెంబర్ 150 ఈ చిత్రంలో రత్తాలు రత్తాలు అనే ఐటమ్ సాంగ్ కోసం మొదట కేథరిన్ అనుకున్నారంట. కానీ చరణ్ సిస్టర్ సుష్మ ఈ ఐటమ్ సాంగ్ కి కాస్ట్యూమ్ డిజైనేర్ గా పని చేసింది. సుష్మ కి కేథరిన్ కి కాస్ట్యూమ్ విషయంలో తేడా రావడంతో కేథరిన్ ను తప్పించి రాయ్ లక్ష్మి ని తీసుకున్నారు. ఇప్పుడు వినయ విధేయ రామ లో కేథరిన్ ను స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలి అని బోయపాటి శ్రీను. రామ్ చరణ్ తో మంతనాలు సాగిస్తున్నాడు. మరి చరణ్ ఒప్పుకుంటాడా అనేది చూడాలి. ఈ ఐటం సాంగ్ కోసం ఇలియానాతో కూడా చర్చలు జరిపినట్లుగా ప్రచారం జరిగింది. విదేయ రాముడితో ఆది పాడేది ఎవరో మరి..