విధేయ రాముడి ఫినిషిన్ టచ్ ఆ అమ్మడితో..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వినయ విధేయ రామ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాని బోయపాటి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తికావచింది. ఈ చిత్రంలో మొదట ఓ ఐటమ్ సాంగ్ ను చిత్రకరించానున్నారు. అందుకోసం అన్నపూర్ణ స్టూడియో లో ఓ పబ్ సెట్ వేశారు అచ్చం పబ్ వాతావరణం తలపించేలా భారీ ఖర్చుతో ఈ సెట్ వేశారు. ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ కోసం ఐటమ్ గర్ల్ గా మొదట రాకుల్, కాజల్, కాథరిన్ పేర్లు వినిపించాయి. మరి ముఖ్యంగా బోయపాటి హీరొయిన్ కాథరిన్ చరణ్ సరసన ఆడుతుంది అనుకున్నారు.

చివరి నిమిషాన కాథరిన్ ప్లేస్ లోకి బాలీవుడ్ హాట్ హాట్ గర్ల్ ఇషా గుప్త ను తీసుకున్నారు. ఇకా ఇషా విషయానికి వస్తే మాత్రం బాలీవుడ్ హాట్ గర్ల్. సోషల్ మీడియా లో కానీ ఈమె గురుంచి సెర్చ్ చేస్తే మాత్రం మన మైండ్స్ బ్లాక్ అయ్యేఫొటోస్ దర్శనం ఇస్తాయి. తాజాగా ఇషా రామ్ చరణ్ వినయ విధేయ రామ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో ఆడుతుంది. ఈ సాంగ్ తరువాత ఖానాపూర్ లో ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తారు. ఈ సాంగ్ ఈ నెల 22 తో పూర్తి అవ్వుతుంది. ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రాని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు.