లుక్ లీక్ కాకుండా జాగ్రత్తలు…!

Rajamouli Restricts NTR In RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోస్ గా ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీ స్టారర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుండి రోజుకో అప్డేట్ వస్తు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్నది. రాజమౌళి ఈ చిత్రం కోసం ఎంతగానో జాగ్రతలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు రామ్ చరణ్ లుక్ పైన ఎటువంటి పుకార్లు రాలేదు. చరణ్ హెయిర్ స్టైల్ ఒక్కటి చేంజ్ చేసి పేస్ లుక్ ను మాత్రం అలాగే ఉంచుతాడు అంటున్నారు.

Jr Ntr New Look For Rajamouli Ram Charan RRR Movie

కానీ ఎన్టీఆర్ లుక్ ను మాత్రం జక్కన్న తనదైనా స్టైల్ లో చెక్కే పనిలో బిజీగా ఉన్నాడు అందుకోసం ఎన్టీఆర్ కు హాలీవుడ్ నుండి స్పెషల్ బాడీ బిల్డింగ్ ట్రైనర్ స్టీవ్ లాయిడ్స్ ను ఇండియాకు రప్పించాడు.ఇప్పటివరకు ఎన్టీఆర్ లుక్ మాత్రం బయటకు రాలేదు. ఇంకో రెండు నెలల్లో ఎన్టీఆర్ లుక్ పూర్తిగా చేంజ్ అవ్వుతుంది అనుకుంటున్నారు. అందరు జక్కన్న మాత్రం ఎన్టీఆర్ లుక్ ని గాని పిక్, వీడియో గాని ఏది బయటకు రాకుండా జాగ్రతలు తీసుకుంటున్నాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ స్పాట్లో పెద్ద పెద్ద జామర్స్ ను ఉపయోగిస్తున్నాడంట. ఆర్ ఆర్ ఆర్ నుండి ఏదైనా వచ్చిన అధికారక పుర్వంగానే రావాలని జాగ్రతలు తీసుకుంటున్నాడు.