ఈసారికి పుకార్లేనన్న మాధవన్…!

Madhavan Clarify TO Role In Ravi Teja Movie

వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా ఓ చిత్రం రుపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో మాధవన్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తునాయి. మాధవన్ నటిస్తే రవి తేజ సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది అనుకున్నారు. మాధవన్ నటిస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ట్ అవ్వుతుందని రవి తేజ ఫాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలపై మాధవన్ స్పందిస్తూ అవ్వని వట్టి పుకార్లే నేను రవి తేజ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ravi-teja-madhavan

ఈ మద్య నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్యసాచి చిత్రంలో మాధవన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం అనుకున్నంత స్తాయిలో ఆడింది లేదు కానీ ఈ చిత్రంలో నటించిన మాధవన్ కు మాత్రం ప్రేక్షకులనుండి మంచి స్పందన్ లబించింది. సో కావున ఇకనుండి మాధవన్ తెలుగులో నటిస్తాడని వార్తలు వచ్చాయి. అలాగే రవి తేజ మూవీ లో కూడా ఓ మెయిన్ రోల్ పాత్రలో కనిపిస్తాడని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించారు. వాటికీ అన్నింటికీ మాధవన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం మాధవన్ అనుష్కతో ఓ సినిమాలో నటిస్తున్నాడు. రవి తేజ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో త్వరలో రవి తేజ ఓ సినిమా చెయ్యబోతున్నాడు. దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.