సవ్యసాచి రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

savyasachi--movie-review

నటీ నటులు : నాగ చైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, శకలక శంకర్, సత్య
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, Y. రవి శంకర్, మోహన్ చెరుకూరి
కథ- స్క్రీన్ ప్లే -దర్శకత్వం : చందు మొండేటి

సవ్యసాచి రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్...! - Telugu Bullet

చందు మొండేటి-నాగచైతన్య కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, Y. రవి శంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘సవ్య సాచి’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో విశేషం. ఈ చిత్రం ద్వారా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. అలాగే, ఒకప్పటి లవర్‌బాయ్ మాధవన్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషించారు. భూమిక ముఖ్య పాత్రలో నటించారు. మొత్తంగా చూసుకుంటే ఇదో మల్టీ పవర్ ప్యాక్ట్ మూవీ. అందుకే ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులకి తెరదించుతూ ఈ సినిమా నేడు విడుదల అయ్యింది. దమరి ప్రేక్షకుల అంచనాలు సినిమా అందుకున్నదా లేదా ? అనేది రివ్యూ చూసి తెలుసుకోవాల్సిందే.

కధ :

savyasachi-movie1
తల్లిదండ్రులు దూరమయి తన అక్క కుటుంబంతో బతుకుతూ ఉంటాడు యాడ్ ఫిలిం డైరెక్టర్ విక్రమాదిత్య ( నాగ చైతన్య ). తనకు అక్క అన్నా మేనకోడలు మహా లక్ష్మి అన్నా ప్రాణం. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిని కలిగి వుండడం వల్ల ఆయన రెండు చేతులకి సమాన బలం ఉంటుంది. అయితే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ బారిన పడి ప్రాణాలతో బతికి బయటపడతాడు. ఆ తర్వాత తాను ఆరేళ్ళ క్రితం ప్రేమించి మిస్సయిన తన ప్రియురాలిని కలుస్తాడు. అలా కలిసి కొద్ది రోజులు కూడా గడవక ముందే. తాన అక్క కుటుంబం మొత్తం గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిందని కేవలం తన అక్క మాత్రమె బతికి ఉందని కానీ తాను ప్రాణంలా చూసుకునే మేనకోడలు చనిపోయిందని తెలుసుకుని బాధ పడతాడు. అయితే ఈ సమయంలో తన మేనకోడలు బతికే ఉందని, ఈ మిస్టరీ వెనుక అరుణ్ (మాధవన్ ) వున్నాడని తెలుసుకుంటాడు. ఇంతకీ అరుణ్ ఎవరు ? ఎందుకు భూమిక కూతురుని కిడ్నాప్ చేస్తారు ? అసలు విక్రమ్ ఫ్యామిలీ ని ఎందుకు టార్గెట్ చేస్తారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

naga chaitanya savyasachi
ఒకే శరీరంలో ఇద్దరు అంటూ చందూ మొండేటి రాసుకున్న పాయింట్ కొత్తగా ఉంది.. ఇప్పటివరకు మనం చూడని కోణం ఇది..దీని చుట్టూనే కథ అల్లుకున్నాడు దర్శకుడు.. అయితే ఊహించనంత పకడ్బందీగా కాదు. ఎందుకంటే మొదట్లోనే కథ చెప్పేసాడు చందూ.. ఆ తర్వాత ఆట మొదలు పెట్టాడు. కన్ఫ్యూజన్ లేకుండా ఒకే బాడీలో ఇద్దరు ఎలా వస్తారో చూపించేసాడు..కానీ హీరోకు ఉన్న ఈ అవలక్షణాన్ని కామెడీ కోసం వాడుకున్నాడు చందూ. హీరో, విలన్ మధ్య చాలా సినిమాలు చూసాం కాబట్టి సెకండాఫ్ రొటీన్ అనిపిస్తుంది. సవ్యసాచి అనే ఒక్క కొత్త కథ చుట్టూ పాత స్క్రీన్ ప్లే అల్లాడు చందూ మొండేటి. కొత్త కాన్సెప్టుతో వచ్చింది కాబట్టి ఇంకా కొత్తదనాన్ని ఆశిస్తాం కానీ ఇందులో అది కనిపించలేదు. ఎందుకంటే సీరియస్ గా సాగుతున్న కధలో లవ్ ట్రాక్, కాలజ్ ట్రాక్ రావడం అంతగా బాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టైల్ లో నడిచే సవ్యసాచి సెకండ్ హాఫ్ మాత్రం ఉహాలకందని విధంగా ఉంది. పది నిమిషాల్లో పద్మవ్యూహం అంటూ ఇంటర్వెల్ అనంతరం దర్శకుడు కథను మలిచిన తీరు ఆడియెన్స్ ని థ్రిల్లింగ్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా మాధవన్ – నాగ చైతన్యల మధ్య జరిగే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అక్కడక్కడా కొద్దిగా స్లోగా అనిపించినా డైరెక్టర్ చందు ఓవరాల్ గా తాను చెప్పాలనుకున్న పాయింట్ ను కామన్ ఆడియెన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేసే విధంగా ప్రజెంట్ చేశాడు. కానీ స్క్రీన్ ప్లేలో తగ్గిన వేగం ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉంది. అలాగే తన కంట్రోల్ లో లేని చేయితో కథానాయకుడికి ఎదురైన అనుభవాలు అతను వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశం క్లయిమాక్స్ వరకు ఉత్కంఠగా అనిపిస్తుంది.

savyasachi movie

అయితే చాలా ఫ్రెష్ కథను ఎంచుకున్న దర్శకుడు చందూ మొండేటి అంతే ఆసక్తిగా స్క్రీన్ ప్లే నడింపించలేకపోయారు. మొదటి 20 నిమిషాలను ఆసక్తిగా అనిపించినా తరువాత లవ్ సీన్స్ తో బోర్ కొట్టించాడు. అయితే ఇంటర్వెల్ ముందు కాస్త ఆసక్తి రేపాడు. ఇక ద్వితీయార్థంలో విలన్ కు హీరో కు మధ్య జరిగే పోరును చాలా బాగా చూపించాడు. ఇక నటన విషయానికి వస్తే విక్రమ్ పాత్రలో నాగ చైతన్య ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన కనబరిచాడు. ప్రతినాయకుడి పాత్రలో మాధవన్ అలరించాడు. హీరయిన్ నిధి అగర్వాల్ గ్లామర్ గా కనిపించింది అంతే కానీ నటన పరంగా ఆమె చాలా ఇంప్రూవ్ కావాల్సి వుంది. తెర మీద కనిపించింది కొద్దీసేపైన తన నటన తో ఆకట్టుకుంది. ఇక వెన్నెల కిశోర్, సుదర్శన్, సత్య ఉన్నతంలో బాగానే నవ్వించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫస్టాఫ్ లో రెండు పాటలు నాగార్జున రీమిక్స్ పాట బాగున్నాయి.

Ninnu Road Meeda Song
ఓవరాల్ గా ఈ సవ్యసాచి కొత్త కాన్సెప్ట్ వరకు ఓకే.. కానీ తెరపైనే ఎక్కడో కాస్త గాడి తప్పిన ఫీలింగ్..
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : సవ్యసాచి…కొత్త కాన్సెప్టే కానీ…?
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75/5