సైలన్స్ లో నేను నటించడం లేదు

అనుష్క ముఖ్య పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సైలెన్స్ అనే చిత్రం రూపొందనున్నది. ఈ చిత్రానికి ఒక్క నిర్మాతగా కోనవెంకట్ వ్యహరిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ అధిక భాగం అమెరికాలో జరుగుతున్నా కారణంగా మరో నిర్మాత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అమెరికా షెడ్యూల్ అంటే భారీ బడ్జెట్ తో కుడి ఉంటుంది. ఈ చిత్రంలో మాడి (మాధవన్) ఓ కీలక పాత్రలో నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ నాగచైతన్య సవ్యసాచి చిత్రంలో మాధవన్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. సవ్యసాచి చిత్రం పరాజయం పాలు అయినా మాధవన్ పాత్రకు మంచి మార్క్స్ పడ్డాయి. అప్పటి నుండి కీలక పాత్రలకోసం మాధవన్ ను సంప్రదిస్తున్నారు. అదే నేపద్యంలో అనుష్క సైలెంట్ సినిమాలో మాధవన్ ఓ కిలకపాత్రలో నటిస్తాడనే వార్తలు వచ్చాయి.

అందుకు మాధవన్ ఆ విషయంపై స్పందించాడు. అనుష్క సైలెన్స్ చిత్రంలో నేను నటించడం లేదు. ఈ సినిమాలోనే కాదు మరే సినిమాలో కూడా నేను ఎటువంటి కీలక పాత్రలు చెయ్యడం లేదు. అవ్వని వట్టి పుకార్లే అంటూ సోషల్ మీడియా ద్వార తెలియజేశాడు. అంతటితో అనుష్క సైలెన్సు చిత్రంలో మాధవన్ నటించడంలేదని ఓ క్లారిటీ వచ్చింది. ఇకా ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ హీరో మైఖేల్ మాడ్సన్ ఓ కీలక పాత్రలో నటిస్తాడు. త్వరలోనే మైఖేల్ నుండి అధికారిక ప్రకటన వేలువడనున్నది. ఈ చిత్రంలో అనుష్క వినికిడి, స్పర్శ కోల్పోయినా లేడీగా నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. మార్చి నుండి సెట్స్ పైకి వెళ్ళుతుంది. అనుష్క భాగమతి చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం సైలెన్సు కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి