అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ

అరుంధతి సినిమా తరువాత అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అలా ఆమె నటించిన సైజు జీరో ఓ మోస్తారు విజయాని సొంతం చేసుకుంది. బాహుబలి సినిమాలో కూడా అనుష్క కథానాయక గా ప్రాముఖ్యం ఉన్న పాత్రను పోషించింది. ఆ చిత్రం అనుష్క కు మంచి పేరును తీసుకువచ్చింది. ఆ తరువాత మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ భాగమతి సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నది. ఇంకా హీరోల సినిమాలో వాళ్ల గురుంచి కలలు కనడం మానేసింది. ఇప్పుడు అందరు అనుష్క గురుంచి కలలు కనడం మొదలు పెట్టారు. ఆ వైపు ఆమె అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆమె మరో లేడీ ఇంపార్టెంట్ ఉన్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు.

ఈ చిత్రానికి సైలెన్స్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరగనున్నది. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ ఓ కీలక పాత్రలో నటిస్తాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ సగభాగం అమెరికా లో జరుగుతున్నా కారణంగా ఈ హాలీవుడ్ స్టార్ అక్కడే షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ చిత్రం యొక్క కథ ఏమిటి అనేది ఇంతవరకు తెలియదు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనిలో దర్శకుడు హేమంత్ మధుకర్ ఉన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటి వరకు చెయ్యని పాత్రను అనుష్క ఈ చిత్రంలో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి.