జెర్సీ నుండి టిజర్ రిలీజ్

నాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రద్దా శ్రీనాద్ హీరొయిన్ గా నటిస్తున్నా చిత్రం జెర్సీ. ఈ చిత్రాని గౌతం తిన్ననురి క్రికెట్ నేపద్యం కలిగిన కథగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే సగం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తాజాగా ఈ చిత్రంనుండి టిజర్ ను విడుదల చేశాడు. టిజర్ ను గమనించినట్లైతే నాని ఈ చిత్రంలో క్రికెటర్ గా నటిస్తున్నాడు. నాని గెట్ అప్ ఆకట్టుకునే విధంగా ఉన్నది. అలాగే ఈ చిత్రంలో నాని ఎన్నో కష్టాలు పడుతూ క్రికెటర్ గా ఎదుగుతాడు. ఎన్నో అవమానాలను భరిస్తాడు. టిజర్ లో ఓ డైలాగ్ నీకు ఆల్రెడీ నీ ఏజ్ 36 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుండి రిటైర్ అయ్యే వయసు ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యగలవు. అంటూ ఓ డైలాగ్ కించపరిచేవిధంగా ఉంటుంది.

పిల్లలను ఆడించే వయసులో మనకు ఆటలు ఎందుకు బావని నాని ఫ్రెండ్ నాని తో అంటూ నిరుత్చాహపరుస్తుంటాడు.ఏంత ప్రయత్నించిన ఇప్పుడు ఏమి చెయ్యలేవు అంటూ ఓ లేడీ వాయిస్ తో నాని అవమానిస్తూ ఉంటుంది. నాని కూడా క్రికెట్ లో ఓడిపోయినవాడిలగా ఉంటాడు ఓ సందర్బంలో గడ్డం పెంచి జీవితంలో అన్ని కోల్పోయినా వ్యక్తిగా కనిపిస్తాడు. అప్పుడు నాని ఆపేస్తే ఓడిపోయినవాడు ఉంటాడు కానీ ప్రయత్నిస్తే ఓడిపోయినవాడు ఇప్పటివరకు లేడని…. నాని ఆ టైములో క్రికెట్ లో సెంచరి చేసిన వ్యక్తిగా టిజర్ లో చూపిస్తున్నారు. జెర్సీ టిజర్ ను విడుదల చేసి ఆ చిత్రంపై అంచనాలు పెంచాడు. ఈ చిత్రంలో నాని, ఆర్జున్ పేరుతో నటిస్తున్నాడు. కన్నడ నటి శ్రద్దా శ్రీనాద్ కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలవుతుంది.