రష్మికకు అభిమానులు వీడియో గిఫ్ట్

ఛలో మూవీ ఫేం రష్మిక మంధన మొదటి సినిమాతో తెలుగులో చాలా మంది అభిమానులను గెలుచుకుంది. ఆ తరువాత గీత గోవిందం చిత్రం విజయంతో కుర్ర కారు హృదయాల్లో చోటు సంపాదించుకుంది. తాజాగా ఆమె విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ చిత్రంలో కథానాయకగా నటిస్తుంది. ఈ మద్య సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో భాగా ఆక్టివ్ గా ఉంటూ తమ విషయాలను ఫాన్స్ తో పంచుకుంటారు. అలాగే రష్మిక మంధన కూడా డియర్ కామ్రేడ్ షూటింగ్ విషయాలను ఎప్పటికప్పుడు తమ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అభిమానులు కూడా ఆమెకు తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు.

తాజాగా రష్మిక కు ఆమె అభిమానులు ఓ వీడియో ను ట్విట్టర్ లో ఆమెకు ట్యాగ్ చేశారు. ఆ వీడియో చూసి ఆమె ఎంతో భావోద్వేగానికి లోనైంది. ఏమిటి ఆ వీడియో అంటే గీత గోవిందం చిత్రం యొక్క ఆడియో ఫంక్షన్ లో ఆమె మాట్లాడిన వీడియో ని కట్ చేసి ఆ సినిమాలోని కొన్ని ఫొటోస్ ని అలాగే ఆ సినిమా యొక్క రష్మిక ఇంటర్వ్యూ ను కట్ చేసి ఓ వీడియో గా క్రియేట్ చేసి ఆమె సోషల్ మీడియా ఎకౌంటు కు ట్యాగ్ చేశారు. అది చుసిన రస్మిక అభిమానులకు కృతజ్ఞతలు చెప్పుతూ…. నాపై ఇంత అభిమానాని చూపిస్తున్నా నా అభిమానులకు థాంక్స్ చెప్పింది. మీలాంటి వారి సపోర్ట్ ఉంటె ఇంకా ఎన్నో సినిమాల్లో నటిస్తాను లవ్ యు గాయ్స్ అంటూ ట్విట్ చేసింది. కన్నడ లోను ఓ రెండు సినిమాలో నటిస్తుంది.