విజయ్ సినిమాలో నటించడం లేదు…!

Actress Rasmika Mandana Tweet About Vijay

విజయ్ సర్కార్ చిత్రం తరువాత తన తదుపరి చిత్రాన్ని అట్లి కుమార్ దర్శకత్వంలో చేయ్యనున్నాడు. ఇప్పటికే ఆ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినదంట. మరో వైవిధ్యమైన కథను విజయ్ కోసం సిద్దం చేసినట్లు తెలుస్తుంది. గతంలో విజయ్, అట్లి కాంబినేషన్ లో తెరి, మెర్సాల్ వంటి సూపర్ హిట్ట్ చిత్రాలు వచ్చాయి. మరల ఇదే కాంబినేషన్ మూవీ అనగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు కథనాయకలను ఎంపిక చేయ్యనున్నారు. అందులో నయనతార ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోక్కరు ఛలో, గీతాగోవిందం చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నా రష్మిక మంధన ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి.

Rashmika Mandanna In Vijay Atlee Film

విజయ్ మూవీలో నటించబోతున్నాట్లుగా వచ్చిన వార్తలను రష్మిక కొట్టి పారేసింది. రష్మిక తాజాగా ఈ విషయం పైన ట్విట్టర్ లో స్పందించింది. విజయ్ తో సినిమా గురుంచి నన్ను ఎవరు స్పందించ లేదు… కావునా ఈ చిత్రంలో నేను నటించడం లేదు. కానీ త్వరలోనే విజయ్ తో ఓ సినిమాలో మాత్రం నటిస్తాను అంటూ పేర్కొంది. ప్రస్తుతం కోలీవుడ్ కంటే టాలీవుడ్ లో ఈమెకు మంచి డిమాండ్ ఉన్నది. తాజాగా టాలీవుడ్ లో వినపడుతున్నా సమాచారం మేరకు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కథానాయకల జాబితాలో రష్మిక పేరు కూడా ఉంది. మరి ఫైనల్ లిస్ట్ లో రష్మిక ఉంటుందో చూడాలి.

Rashmika acts without makeup in her next movie