రచ్చ లేపుతున్న మారి-2 మాస్ పాట – రౌడీ బేబీ

maari 2 movie rowdy baby song

తమిళ హీరో ధనుష్ నటిస్తున్న మారి – 2 సినిమా తెలుగులోను ఆసక్తి రేపుతోంది. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2015 లో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘మారి’ కి సీక్వెల్. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2017 లో విడుదలవ్వగా, థియేటర్లలో సరిగ్గా ఆడకున్నా, యూట్యూబ్లో మాత్రం ఇప్పటికి సూపర్ గా ఆడుతుంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మారి-2 సినిమాని వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

rowdy-baby

ఇప్పటికే ఈ సినిమా తమిళ వెర్షన్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మూవీ టీం, ఈరోజు ఒక పాట లిరికల్ వీడియో ని విడుదల చేసింది. ఈ పాటని ధనుష్ మరియు ఢీ (దీక్షిత) కలిసి పాడగా, యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ట్రెండీగా ఉండి, పాటలోని లిరిక్స్ మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. సినిమాలో ఈ సినిమాకి కొరియోగ్రఫీ ప్రభు దేవా చేస్తుండడం తో, ప్రభు దేవా కంపోజ్ చేసే స్టెప్పులను సాయి పల్లవి ఎలా చేయబోతుందో అని సాయి పల్లవి అభిమానులందరూ తెగ ఊహించేసుకుంటున్నారు. ఈ పాట మధ్యలో వినిపించే సంగీతం మనం ఎక్కడో విన్న తెలుగు పాట ని గుర్తుచేస్తుంది. మారి సినిమాకి ధనుష్ తనకి ఇష్టమైన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కి సంగీత బాధ్యతలు అందించగా, మారి-2 కి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండడంతో ధనుష్ మరియు అనిరుధ్ ల మధ్య ఏమైనా విభేదాలు చోటుచేసుకున్నాయా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 21 న విడుదల అవ్వబోతుండగా, తెలుగు వెర్షన్ విడుదలకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు.