సస్పెన్స్ ఇచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’

సస్పెన్స్ ఇచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’

అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న ‘నిశ్శబ్దం’ ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ అట. సినిమాలో మర్డర్ చేసింది ఎవరు అనే కోణంలో ఊహించని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్ లతో ఈ సినిమా నడుస్తోందట. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం సినిమాలో మర్డర్ చేసేది అనుష్కనేనట. ఈ విషయం క్లైమాక్స్ లో బిగ్ ట్విస్ట్ గా రివీల్ అవుతుందని.. సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తోంది.

అలాగే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్, మరియు అనుష్క, మాధవన్ ల మధ్య రిలేషన్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయట. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. ఇక మాధవన్ ఈ చిత్రంలో సెల్లో ప్లేయర్ గా నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మరో సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.