‘సవ్యసాచి’ ప్రివ్యూ…!

Savyasachi Movie Preview

అక్కినేని నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ వారు నిర్మించిన చిత్రం ‘సవ్యసాచి’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, అన్ని కార్యక్రమాలు కూడా ముగించుకుని రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం దాదాపు ఆరు నెలలుగా వాయిదాలు పడుతూ వస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ చిత్రం శైలజా రెడ్డి అల్లుడు కంటే ముందు రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేశారు. తాజాగా ఈచిత్రం భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది.

savyasachi

హీరో ఒక చేయి తన పరిధిలో లేకుండా పని చేస్తూ ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌ ఇప్పటి వరకు సౌత్‌ లో వచ్చిన దాఖలాలు లేవు. టీజర్‌ మరియు ట్రైలర్‌ లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. ఇక పాటలు కూడా సినిమాకు హైలైట్‌ అవుతాయని అంటున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా మాధవన్‌ నటించడంతో తప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. చైతూ మరియు చందు మొండేటిల కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమమ్‌’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఆ చిత్రం దారిలోనే ఈ చిత్రం కూడా సక్సెస్‌ అవుతుందని అంతా నమ్ముతున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం ఏమేరకు అందుకుంటుందో చూడాలి. రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.

savya-sachi