నా సామిరంగ: ఇప్పుడు ఓటీటీ లో కి వచ్చేసింది ..!

నా సామిరంగ: ఇప్పుడు ఓటీటీ లో కి వచ్చేసింది ..!
Cinema News

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ “నా సామిరంగ” కోసం అందరికీ తెల్సిందే. మరి సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ నాగ్ కెరీర్ లో మరో సంక్రాంతి హిట్ గా నిలిచింది. అయితే సంక్రాంతికి వచ్చిన మూవీ ల లో దాదాపుగా అన్ని మూవీ లు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కో వచ్చేసాయి.

నా సామిరంగ: ఇప్పుడు ఓటీటీ లో కి వచ్చేసింది ..!
Naa Saami Ranga

ఫైనల్ గా ఇప్పుడు నా సామిరంగ కూడా వచ్చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వారు హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. ఇక ఈ మూవీ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా , రుక్షర్ ధిలాన్ తదితరులు నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.