మహానాయకుడు వాయిదా పడేనా…?

Mahanayakudu To Get Postponed

ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మరియు ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రం విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది. మొదటి పార్ట్‌ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఇక రెండవ పార్ట్‌ను రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండవ పార్ట్‌ అదే ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ntr-bio-pic

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ కథానాయకుడు పార్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. కాని మహానాయకుడుకు సంబంధించిన చిత్రీకరణ చాలా బ్యాలన్స్‌ ఉందట. ముఖ్యంగా రథయాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయట. అందుకే మహానాయకుడు వాయిదా వేసి సమ్మర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. చిత్రీకరణ ఆలస్యం వల్ల కాదు వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు భయపడి సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్‌ మహానాయకుడు రిపబ్లిక్‌ డేకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ntr-biopic-movie