జగన్ చొక్కానే కీలకం…ఏమవనుందో !

Police Asked For Jagan Shirt For Investigation

విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జగన్ భుజానికి గాయం అయ్యింది.ప్రస్తుతం దాడి చేసిన నిందితున్ని విచారిస్తున్న పోలీసులు హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన చొక్కాను జగన్‌ నుంచి స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని విశాఖ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విమానాశ్రయంలో మాట్లాడిన విశాఖ పశ్చిమ ఏసీపీ ఎల్‌.అర్జున్‌ హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన చొక్కాకు రక్తం అంటడంతో జగన్‌ దాన్ని మార్చుకుని, మరొకటి వేసుకుని విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లారని తెలిపారు. విచారణలో భాగంగా హత్యాయత్నం జరిగినప్పుడు ధరించిన చొక్కాను జగన్‌ నుంచి స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరామని తెలిపారు.

Court And Jagan

అయితే ఇప్పుడు జగన్ చొక్కా కీలకంగా మారింది. ఎందుకంటేకత్తి దాడిలో గాయపడ్డ జగన్‌కు ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లోనే చికిత్స అందించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్న డాక్టర్‌ను పిలిపించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న అపోలో వైద్యురాలు లలితా స్వాతి అక్కడ జగన్‌ను పరిశీలించారు. స్పిరిట్‌, బెటాడిన్‌తో గాయాన్ని శుభ్రం చేసి నియోమైసిన్‌ ఆయింట్‌మెంట్‌ రాశారు. రక్తస్రావం కాకుండా గాజుగుడ్డతో గట్టిగా కట్టుకట్టారు. యాంటీ బయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్‌ వాడాల్సిందిగా సూచించారు. ఇదంతా పది నిమిషాల్లోనే పూర్తయింది. ఒంటిగంటకు విమానం బయలుదేరాల్సి ఉండగా ఐదు నిమిషాల ముందుగా చొక్కా మార్చుకుని జగన్‌ ఎప్పటిలాగానే ఉల్లాసంగా కనిపిస్తూనే విమానం ఎక్కారు.

Knife attack on Reddy

అయితే జగన్‌ ఎడమ చేతికి 0.5 మిల్లీ మీటరు (అర సెంటీమీటరు) లోతున భుజానికి గాయమైందని డాక్టర్‌ స్పష్టం చేశారు. కానీ హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులేమో జగన్‌కు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున గాయమైందని, ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు. దీంతో విశాఖలో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు హైదరాబాద్‌ చేరుకునే సరికి నాలుగు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది. అయితే ఈ సమయంలోనే లలితా స్వాతి తన స్నేహితుడితో ఫోన్ లో మాట్లాడుతున్న ఫోన్ కాల్ బయటకు వచ్చింది అందులో జగన్ గాయం అరా సెంటీమీటరేనని బల్లగుద్ది చెప్పిన స్వాతి రోజులు గడిచే కొద్దీ ప్రాణ భయంతోనో మరి ఇంకే భయంతోనో కానీ మాట మార్చింది. తాను ఇచ్చిన మెడికల్ రిపోర్టుమీద మీడియా చానెళ్ళు తప్పుడు ప్రచారం చేశాయని స్వాతి మాట మార్చింది. విశాఖపట్నం విమానాశ్రయంలో ఉండగానే జగన్ పై దాడి జరిగిందని, తొందరగా రావాలంటూ కొంతమంది పరుగున తనవద్దకు వచ్చారని ఆమె చెప్పింది. వెంటనే నేను స్టెతస్కోప్, బీపీ మెషిన్ తీసుకుని అక్కడకు వెళ్లానని చెప్పిన లలిత జగన్ చొక్కా రక్తంతో తడిసిపోగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ చేశాని చెప్పుకొచ్చింది.

visakha airport In jagan

ప్రధమ చికిత్స కంటే మించి జగన్ కు మరే చికిత్స చేయలేదని లలిత తెలిపింది. జగన్ బుజానికి దాదాపు 0.5 సెంటిమీటర్ల కత్తి దిగి ఉండవచ్చునని ప్రాథమిక అంచనాకు వచ్చానని ఆమె చెప్పింది. అదీ కూడా పోలీసు అధికారులు త్వరగా చికిత్స చేయాలని ఒత్తిడి చేయడంతోనే తాను చికిత్స అందించానని గాయం లోతు అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చని తాను భావించానని, కానీ కొందరు ఆ రిపోర్టును పట్టుకుని తప్పుడు ప్రచారం చేశారనిఇప్పుడు ఆమె చెబుతోంది. జగన్ బుజానికి అయిన గాయం లోతు కేవలం 0.5 సెంటిమీటర్లు మాత్రమే ఉంటుందని తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని డాక్టర్ లలిత స్పష్టం చేసింది. ఈ ఆరోపణల నేపధ్యంలో జగన్ చొక్కా ఇప్పుడు కీలకంగా మారనుంది.