సౌత్‌ నుండి ‘మహానటి’కి మాత్రమే ఛాన్స్‌…!

Padmaavat Mahanati And Nagarkirtan Among Others In Indian Panorama Section Of IFFI 2018

తెలుగు వారు ఎప్పటికి గుర్తుంచుకునే హీరోయిన్‌ సావిత్రి. తెలుగులోనే కాకుండా తమిళనాట కూడా స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. ఈ చిత్రం అనుకున్న బడ్జెట్‌కు రెట్టింపు అయ్యింది. అయినా కూడా పెట్టిన బడ్జెట్‌కు రెట్టింపు లాభాలు వచ్చాయి. సినిమాతో డబ్బు మాత్రమే కాకుండా సినిమాలో వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు వచ్చింది.

Padmaavat-Mahanati-And-Naga

అశ్వినీదత్‌కు ఈ చిత్రం మరో మంచి సినిమాగా నిలిచింది. ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకున్న ఈ చిత్రం మరో అరుదైన గౌరవంను దక్కించుకుంది.ఈ నెలలో గోవాలో జరుగబోతున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో సౌత్‌ నుండి కేవలం మహానటికి మాత్రమే ఛాన్స్‌ దక్కింది. మెయిన్‌ స్ట్రీమ్‌లో సౌత్‌ సినిమా ‘మహానటి’కి మాత్రమే ఛాన్స్‌ దక్కగా ఉత్తరాది సినిమాలు రాజీ, టైగర్‌ జిందా, పద్మావత్‌ చిత్రాలు ఉన్నాయి. మొత్తంగా ఇండియన్‌ సినిమాలు నాలుగు మాత్రమే మెయిన్‌ స్ట్రీమ్‌లో ప్రదర్శితం కాబోతున్నాయి. ఇక 22 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కూడా ప్రదర్శణకు సిద్దం అవుతున్నాయి. సౌత్‌ నుండి కేవలం మహానటికి మాత్రమే ఈ అవకాశం రావడంతో అంతా కూడా ఆనందంను వ్యక్తం చేస్తున్నారు.

maha-nati