సవ్యసాచి ట్రైలర్ : బలరాముడంటే రాముడికి చుట్టమా ?

Savyasachi Movie Trailer

అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబోలో తెరకెక్కిన వినూత్న కాన్సెప్ట్ మూవీ ‘సవ్యసాచి’ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘సుభద్ర పరిణయం’ నాటకానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ సవ్యసాచి చిత్రానికి సంబంధించి యాక్షన్, థ్రిల్లింగ్, లవ్, సెంటిమెంట్‌లను మాత్రమే టీజర్ ట్రైలర్‌ల ద్వారా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మొత్తం హాస్యప్రధానంగా ఉంది. ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ కూడా ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కాలేజ్‌లో చైతూ ఆయన ఫ్రెండ్స్ కలిసి ‘సుభద్ర పరిణయం’ నాటకం వేస్తారు. ఆ నాటకంపైనే ఈ ట్రైలర్‌ను కట్ చేసి రక్తి కట్టించారు. ఇందులో కృష్ణుడిగా వెన్నెల కిషోర్, అర్జునుడిగా చైతూ, బలరాముడిగా హైపర్ ఆది, చెలికత్తెగా విద్యు ల్లేఖా రామన్ కనిపిస్తున్నారు. మరి ఆ కామెడీ విందు మీరు కూడా ఆరగించేయ్యండి మరి.