మర్రి వర్గం కలిసి వచ్చేనా…?

YSRCP Leaders Vidadala Rajini Vs Marri RajaSekhar Reddy

చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ వైకాపాలో కొనసాగుతారా..? ఆపార్టీకి రాజీనామా చేసి రాజకీయంగా తెరమరుగు అవుతారా..? లేదా..టిడిపి అభ్యర్థికి పరోక్షంగా మద్దతు ఇస్తారా..? లేదా పార్టీలోనే కొనసాగుతూ పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా..అనేదానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటిదాకా ఒక క్లారితీకి రాలేకపోతున్నారు. ఇదే విషయాన్ని రాజశేఖర్‌’ను కొందరు మీడియా మిత్రులు వివరణ కోరగా వైకాపాను వీడే ప్రసక్తేలేదని, మరో పార్టీలో చేరే ఆలోచన లేదని పార్టీ అభ్యర్థిగా ‘రజనీ’ ఎన్నికల్లో పోటీ చేస్తే, మనస్ఫూర్తిగా పనిచేస్తాను..ఇందులో రెండో విషయం లేనేలేదన్నారు.

rajani

అయితే మీరు మనస్ఫూర్తిగా పనిచేస్తామని చెబుతున్నా మీ పార్టీ కార్యకర్తలు, బంధు,మిత్రుల సంగతేమిటని ప్రశ్నించగా తనతోపాటు మిగతా వారు కూడా పనిచేస్తారని భావిస్తున్నానని అన్నారు. కానీ ఎవరి మనస్సులో ఏముందో తనకేం తెలుసనని…పార్టీ అభ్యర్థిగా ఆమెను దింపినా..మరెవరికైనా సీటు ఇచ్చినా తాను ‘జగన్‌’ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైకాపా నాయకులు, కార్యకర్తల మద్దతు ఇవ్వడంపై స్థానిక నేతలని మీడియా ఆరా తీస్తే ‘రజనీ’ అభ్యర్థిగా పోటీ చేస్తే..’మర్రి’ మనస్ఫూర్తిగా పనిచేయవచ్చు..ఈ విషయంలో తాము మనస్ఫూర్తిగా పనిచేయాలా..? వద్దా..అనేవిషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు చెబుతున్నట్టు తెలుస్తోంది.

Vidadala-Rajini-Vs-Marri-Ra

అయితే మరోపక్క మంత్రి పుల్లారావు, ఆయన కుటుంబసభ్యులపై వ్యతిరేకత ఉన్నవారు కూడా అవసరమైతే..’జనసేన’ అభ్యర్థికి మద్దతు ఇస్తాం కానీ..ఇటు ‘రజనీ’కి మద్దతు ఇచ్చే పరిస్థితిలేదని చెబుతున్నారట. కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటే చాలా..? పార్టీ పట్ల విధేయత అవసరం లేదా..? ‘రజనీ’ రూ.50కోట్లు ఖర్చుపెడితే..పుల్లారావు రూ.100కోట్లు ఖర్చుపెట్టగల సమర్థుడు. సొమ్ములే పనిచేస్తే…2004లో పుల్లారావు ఎందుకు ఓడిపోయారు..? మరో ఆరు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని..వైకాపా అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారో..ఎదురు చూస్తామని చెబుతున్నారు.

ysrcp-rajani