ఓదెల2 సెకండ్ షెడ్యూల్ వచ్చేసింది : మేకింగ్ వీడియో రిలీజ్!

Odela 2 second schedule is here: making video release!
Odela 2 second schedule is here: making video release!

సూపర్‌హిట్ OTT మూవీ ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్ అయిన ఓదెల 2 మూవీ ని కాశీలో ప్రకటించారు మేకర్స్. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన ఈ మూవీ ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా తమన్నా శివశక్తి పాత్రలో నటిస్తున్న మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేయగా, చాలా మంచి స్పందన లభించింది.

Odela 2 second schedule is here: making video release!
Odela 2 second schedule is here: making video release!

తమన్నా పాత్రకు సంబందించిన వీడియో ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో చాలా చాలా బాగుంది. ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. అంతేకాక ఈ మూవీ కి సంబందించిన సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు వీడియో లో మేకర్స్ వెల్లడించారు. సౌందర్ రాజన్ ఎస్ కెమెరామెన్ గా వ్యవహరిస్తుండగా, కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ గారు ఆర్ట్ డైరెక్టర్. తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, మరియు పూజా రెడ్డి లు నటిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.