కల్కి 2898 ఏడీ తెలుగు ప్రోమో వచ్చేసింది …. !

Kalki 2898 AD Telugu promo is here....!
Kalki 2898 AD Telugu promo is here....!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ . ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇటీవల ‘కల్కి’ నుంచి విడుదలైన అమితాబ్ అశ్వత్థామ ప్రోమోకి విపరీతమైన స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.

Kalki 2898 AD Telugu promo is here....!
Kalki 2898 AD Telugu promo is here….!

ఈ క్రమంలో చిత్రయూనిట్ తాజాగా తెలుగు ప్రోమోని విడుదల చేసింది. ‘ద్వాపరయుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా.. ద్రోణాచార్యుడి పుత్రుడిని, నా పేరు అశ్వత్థామ’ అని అమితాబ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంతుంది . ఇప్పటికే గ్లింప్స్ అమితాబ్ యంగ్ లుక్కు ప్రశంసలు వెల్లువెత్తాయి.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా లో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.