“బాహుబలి” కొత్త సిరీస్ కి ఓటిటి పార్ట్నర్ , రిలీజ్ డేట్ వచ్చేసింది ..!

"Baahubali" new series OTT partner, release date has arrived ..!

ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ “బాహుబలి” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) కలయికలో వచ్చిన ఈ మూవీ రికార్డు వసూళ్లు కొల్లగొట్టి ఒక ట్రేడ్ మార్క్ ను సెట్ చేసుకుంది. అయితే ఈ సెన్సేషనల్ పాత్ర నేపథ్యంపై దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి యానిమేటెడ్ సిరీస్ “బాహుబలి – క్రౌన్ ఆఫ్ బ్లడ్” వస్తున్నట్టుగా అఫీషియల్ గా అప్డేట్ అందించిన సంగతి అందరికి తెలిసిందే.

"Baahubali" new series OTT partner, release date has arrived ..!
“Baahubali” new series OTT partner, release date has arrived ..!

అయితే అది డేట్ ఎప్పుడు ఓటిటి పార్ట్నర్ ఏంటి అనేది ఇంకా రివీల్ కాలేదు. మరి ఇపుడు దీనిపై ఫైనల్ గా అప్డేట్ వచ్చింది . ఈ సిరీస్ ను డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సిరీస్ ఈ మే 17న రిలీజ్ కు వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మాహిస్మతి సామ్రాజ్యంలో కొత్త కోణంతో ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఇది ఆసక్తిగా ఉన్నది . మరి ఈ సిరీస్ ను రాజమౌళి, శరద్ దేవరాజన్ లు క్రియేట్ చేయగా ఇప్పుడు సిరీస్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.