“లవ్ టుడే” హీరో నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో !

"Love Today" Hero Next Movie Announcement Video!

లవ్ టుడే మూవీ తో సూపర్ హిట్ సాధించిన హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ మూవీ లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా, డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. తెలుగు లో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ హీరో తదుపరి అశ్వత్ మరిముతూ దర్శకత్వం లో నటించనున్నారు. నేడు తాజాగా అందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో ని రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

"Love Today" Hero Next Movie Announcement Video!

“Love Today” Hero Next Movie Announcement Video!

AGS ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కల్పతి ఎస్. అగోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ లు సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ మూవీ కి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. అనౌన్స్ మెంట్ వీడియో ని ఆకట్టుకొనే విధం గా తీశారు. హీరో పదేళ్ల తరువాత వారి రీ యూనియన్ గురించి చర్చించారు. అయితే ఈ కాన్సెప్ట్ అంతా కూడా మూవీ మేకింగ్ గురించి ఉంది. హీరో తనదైన శైలిలో నే ఆకట్టుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏప్రిల్ 10 వ తేదీన వెల్లడి కానున్నాయి.