‘సలార్ 2’: ఈ నెలలోనే యాక్షన్ మొదలవుతుందా?

'Salar 2': Will the action begin this month itself?
'Salar 2': Will the action begin this month itself?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లని సాధించింది.దాదాపు 700 కోట్లకి పైగా వసూళ్లను వసూలు చేసింది .

'Salar 2': Will the action begin this month itself?
‘Salar 2’: Will the action begin this month itself?

ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి కుమారి , శ్రీయ రెడ్డి తదితరులు ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ఈ మూవీ ని నిర్మించాడు.రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.‘సలార్’కి సీక్వల్గా రాబోతున్న ‘సలార్-2’ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘సలార్’ పార్ట్-2 షూటింగ్ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు చెప్పాయి . తొలి షెడ్యూల్లో 10 రోజులపాటు ప్రభాస్, పృథ్వీరాజ్లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారంట . దీనికోసం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ వేసినట్లు సమాచారం. తొలుత ప్రభాస్ సీన్లు పూర్తి చేసి, వచ్చే ఏడాది ఆరంభంలో మిగతా షూటింగ్ పూర్తిచేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారంట . 2025 చివర్లో సినిమా ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.