“సలార్ 2” లో మరో హీరోయిన్ ఎవరో తెలుసా ..?

Do you know who is the other heroine in
Do you know who is the other heroine in "Salar 2" ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సలార్-2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి . ఇందులో భాగంగానే ‘సలార్ 2’ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు. ఆల్ రెడీ ఇప్పటికే సలార్ 2 షూటింగ్ మాత్రం మొదలైంది. ఐతే, తాజాగా ఈ మూవీ కు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్ వస్తుంది . మరి, కియారా అద్వానీ, నిజంగానే ప్రభాస్ సరసన నటిస్తే.. ఆ క్రేజే నే వేరు.

Do you know who is the other heroine in "Salar 2" ..?

Do you know who is the other heroine in “Salar 2” ..?

కాకపోతే.. కియారా అద్వానీ పాత్ర మాత్రం సెకండ్ హాఫ్ లో మాత్రమే ఉంటుందని.. అలాగే ఆమె పై ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది . అన్నట్టు, ఈ పార్ట్ 2 మూవీ కు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ని ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ మూవీ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ లో ఈ మూవీ పార్ట్-2ను స్టార్ట్ చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 మూవీ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు.