పారితోషికం ఎక్కువ ఇచ్చారు కనుకే ముద్దులు…!

Heroine Hebba Patel In 24 Kisses

‘కుమారి 21ఎఫ్‌’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత వరుసగా సినిమాల్లో ఛాన్స్‌ు దక్కించుకున్న ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. కొన్నాళ్ల పాటు హెబ్బా పటేల్‌ సందడి కొనసాగింది. ఆ వెంటనే హెబ్బా పటేల్‌కు అవకాశాలు తగ్గాయి. గత సంవత్సరం పూర్తిగా సినిమాలకు హెబ్బా దూరంగా ఉంది. అవకాశాలు లేకపోవడం వల్లే హెబ్బా సినిమాకు దూరంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా హెబ్బా ‘24 కిస్సెస్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌ మద్య కిస్సుల వర్షం కురియబోతుంది. ప్రస్తుతం యూత్‌ ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

24-kisses-movies

ప్రస్తుతం సినిమాల్లో కిస్సెస్‌ అనేవి కామన్‌ అయ్యాయి. కాని 24 కిస్సెస్‌ అంటే మామూలు విషయం కాదు. తెలుగులో ఇన్ని కిస్సెస్‌ అవ్వడంతో సినీ వర్గాల వారు కూడా ఈ చిత్రంపై ఫోకస్‌ చేస్తున్నారు. తాజాగా హెబ్బా పటేల్‌ ఈ చిత్రంలో ముద్దుల విషయమై క్లారిటీ ఇచ్చింది. తాను ఈ చిత్రంలో ముద్దులు పెట్టేందుకు అంగీకరించడానికి ప్రధాన కారణం పారితోషికం. పారితోషికం ఇస్తున్నప్పుడు దర్శకుడు చెప్పినట్లుగా నటించాల్సిన అవసరం ఉంది. అందుకే ముద్దులు పెట్టేందుకు సిద్దం అయ్యాను. నటించాలని అనుకున్నప్పుడు అన్ని విధాలుగా నటించాలి. ముద్దు పెట్టుకోవడం కూడా నటనలో భాగమే అని తాను భావిస్తాను అంటూ హెబ్బా పటేల్‌ చెప్పుకొచ్చింది. ఈ ముద్దుల సినిమా హెబ్బాను మళ్లీ బిజీ అయ్యేలా చేస్తుందే చూడాలి.

24-kisses-movies-hebbapatel