అనుపమకు పని అంటే ఇంత శ్రద్ద…!

Anupama Parameshwara Also Suffered Due To The Rains And Floods Of Kerala

మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ పని పట్ల కనబర్చుతున్న శ్రద్దకు ఆమెపై సినీ వర్గాల వారితో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అనుపమ ‘హలో గురు ప్రేమకోసమేరా’ అనే చిత్రంలో నటిస్తోంది. రామ్‌ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంకు సంబంధించిన చివరి షెడ్యూల్‌ తాజాగా ప్రారంభం అయ్యింది. కేరళలో భారీ వర్షాల కారణంగా జనజీవనం మొత్తం అస్థవ్యస్థం అయ్యింది. పలువురు హీరోయిన్స్‌ కూడా ఇల్లు మునిగి పోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. అనుపమ పరమేశ్వరన్‌ కూడా కేరళ వర్షాలు మరియు వరదల కారణంగా ఇబ్బంది పడటం జరిగింది. అయినా కూడా సినిమా షెడ్యూల్‌కు తాను ఇచ్చిన డేట్ల ప్రకారం షూటింగ్‌కు హాజరు అయ్యింది.

anupuma

కేరళలో ఇంకా విమాన సర్వీసులను అన్ని చోట్లకు పునరుద్దరించలేదు. దాంతో కేరళ నుండి రోడ్డు మార్గం ద్వారా చాలా దూరం ప్రయాణించి హైదరాబాద్‌ చేరుకుంది. మరో వారం పది రోజుల వరకు అనుపమ షూటింగ్‌కు రాదని ముందే చిత్ర యూనిట్‌ సభ్యులు అనుకున్నారు. కాని చెప్పిన టైంకు వచ్చేయడంతో అంతా షాక్‌ అయ్యారు. సినిమా అంటే ఆమెకు ఉన్న అభిమానం, వర్క్‌ పట్ల ఆమె డెడికేషన్‌కు అంతా ఫిదా అవుతున్నారు. అనుపమ పరమేశ్వరన్‌ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉండగా ఇలా ఇబ్బందులు పడుతూ వచ్చింది. హలో గురు ప్రేమకోసమే విడుదల తేదీ దగ్గర పడుతుంది. ఈ సమయంలో అనుపమ పరమేశ్వరన్‌ షూటింగ్‌కు హాజరు కాకుంటే సినిమా విడుదల వాయిదా పడేది. ఆ ఇబ్బంది లేకుండా హీరోయిన్‌ నిర్మాత శ్రయస్సు కోరి ఆమె ఇబ్బంది పడుతూ చిత్రీకరణలో పాల్గొంది.

anumupa