గీత, సామ్రాట్‌లు అతి చేస్తున్నారా…?

Samrat Kissed GeethaMadhuri In Bigg Boss House

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయినప్పటి నుండి ఏదో ఒక విషయమై వివాదం చెలరేగుతూనే ఉంది. వివాదం కాకున్నా కనీసం ఏ ఇద్దరి మద్య అయినా ఒక వింత సంబంధం కొనసాగడం వంటి విషయాలు జరుగుతున్నాయి. దాంతో ఈ షోకు మంచి టీఆర్పీ రేటింగ్‌ దక్కుతుంది. తనీష్‌ మరియు దీప్తి సునయనల మద్య వ్యవహారం నడిచింది. ఆ వ్యవహారం ప్రేమ వ్యవహారం కాదని వారు చెబుతూ వచ్చారు. ఇద్దరి మద్య చాలా క్లోజ్‌నెస్‌ పెరిగింది. ఆ తర్వాత తనీష్‌ మరియు నందిని రాయ్‌ల మద్య వ్యవహారం నడిచింది. అర్థరాత్రి సమయంలో లేచి వారిద్దరి కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవడం చేశారు. ఇక సామ్రాట్‌, తేజస్విల విషయం ఏ రేంజ్‌లో వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా గీత, సామ్రాట్‌ల వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది.

bigboss

గీత గురించి ఇలాంటి ఒక వార్త వినాల్సి వస్తుందని ప్రేక్షకులు ఎప్పుడు ఊహించి ఉండరు. విషయానికి వస్తే గీత గత కొన్ని రోజులుగా సామ్రాట్‌తో కాస్త అతి చనువుతో ప్రవర్తిస్తూ వస్తుంది. ఎవరితో అయినా ఒక రేంజ్‌ దూరం మెయింటెన్‌ చేస్తూ వచ్చే గీత తాజాగా సామ్రాట్‌తో మాత్రం గీతను చెరిపేసింది. అతడితో అతి చనువుగా ఉంటుంది. ఇదే విషయాన్ని శ్యామల మరియు దీప్తిలు చెపేందుకు ప్రయత్నించారు. సామ్రాట్‌తో నీ చనువు ఎక్కువ అవుతుంది, బయట అది వేరే విధంగా వెళ్లే అవకాశం ఉంది అంటూ వారు హెచ్చరించారు. అయినా కూడా గీత మాధురి మాత్రం ఏమాత్రం తగ్గకుండా సామ్రాట్‌తో చనువుగా ఉంటుంది. గీత ఎలాగూ చనువుగా ఉంది కదా అని తాజాగా అతడు ముద్దు కూడా పెట్టేశాడు. ప్రస్తుతం ఆ ముద్దు సోషల్‌ మీడియాలో సంచనానికి తెర లేపుతోంది. ముందు ముందు ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో అని ప్రేక్షకులు భావిస్తున్నారు.

bigboss2