కేంద్రానికి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం !

op rewat shocks election committee

ఈసారి బీజేపీ, మోడీ ప్రభ తగ్గడంతో తమకి రిస్క్ రాకుండా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించి ఒడ్డున పడవచ్చు అనుకున్న కేంద్రానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. జమిలి ఎన్నికలు నిర్వహించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ ప్రకటించేశారు. అంతేకాక తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వినిపిస్తున్న ముందస్తు ఎన్నికలకు కూడా అవకాశం లేదని తేల్చి చెప్పారు రావత్. అసలు కేంద్రం చెబుతున్న జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు అవసరమని చెప్పిన కమిషనర్ అందుకు లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాలని పేర్కొన్నారు.

 election committee

ఒకవేళ సవరణలకు అంగీకరిస్తే అందుకు చట్ట సభ్యులు కనీసం ఏడాది సమయం తీసుకుంటారని, కాబట్టి ప్రస్తుతానికి జమిలికి వెళ్లే అవకాశమే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సాధారణంగా 14 నెలల ముందుగానే కార్యాచరణ ప్రారంభిస్తామని రావత్ పేర్కొన్నారు. తమ వద్ద 400 మంది సిబ్బందే ఉన్నారని, అయితే, ఎన్నికల నిర్వహణకు మాత్రం కోటిమందికిపైగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల విషయానికి వస్తే అదంత ఆషామాషీ కాదన్నారు. సిబ్బంది, భద్రత, ఈవీఎంలు, వీవీపాట్‌ తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని.. అదంతా ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికాదని ఆయన చెప్పుకొచ్చారు.