భీష్మలో హెబ్బాపటేల్!

hebba patel in bhishma movie

కుమారి 21ఎఫ్ చిత్రంతో యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది గుజరాతీ సోయగం హెబ్బా పటేల్. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా 24 కిస్సెస్ చిత్రాల్లో కనిపించింది. గత ఏడాదికాలంగా ఈ అమ్మడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నది. తాజాగా ఈ సొగసరి నితిన్‌కు జోడీగా నటించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం నితిన్ భీష్మ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకుడు. రష్మిక కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అభినయానికి ఆస్కారం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు హెబ్బా పటేల్ అంగీకరించిదని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం హెబ్బాపటేల్ బరువు తగ్గి స్లిమ్‌గా తయారైందట. ప్రస్తుతం ఆమె షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిసింది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.