జీరో మూవీ నుండి రెండు కొత్త పోస్టర్స్ విడుదల చేసిన షారుఖ్ ఖాన్…!

Zero Movie Posters Released

ఒకప్పుడు వరుస విజయాలతో బాలీవుడ్ ఖాన్ త్రయం లో ముందున్న షారుఖ్ ఖాన్ గత కొన్ని సవంత్సరాలుగా వరుస పరాజయాలతో రేసులో వెనుకబడిపోయాడు. అతను నటించిన ఫ్యాన్ గానీ, రాయీస్ గానీ , జబ్ హ్యారి మెట్ సెజల్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని, ఒక విభిన్న కథాంశాన్ని ఎన్నుకొని, మరుగుజ్జుగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘జీరో’. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో సుమారు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ మరియు అనుష్క శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కత్రినా కైఫ్ ఈ జీరో సినిమాలో స్టార్ హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా, అనుష్క శర్మ మానసిక పరిపక్వత లేని యువతి పాత్రలో నటిస్తుంది.

zero-movie

షారుఖ్ ఖాన్ పుట్టినరోజుని పునస్కరించుకొని నవంబర్ 2న జీరో సినిమా ట్రైలర్ ని ఐమాక్స్, వాడాలా లో విడుదల చేస్తునట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ అయిన తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.ఇక విషయానికి వస్తే, షారుఖ్ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ లో జీరో మూవీ కి సంబంధించిన రెండు కొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఒక పోస్టర్లో షారుఖ్ ఖాన్ రెడ్ డ్రెస్ లో మిలమిల మెరిసిపోతున్న కత్రినా కైఫ్ కి ముద్దు పెడుతున్నట్లు ఉండగా, మరో పోస్టర్లో అనుష్క శర్మ తో పాటు వీల్ చైర్ లో రోడ్ మీద సరదాగా పాట పాడుకుంటున్నట్లు ఉంది. ఈ సెకండ్ పోస్టర్ తోనే అనుష్క శర్మ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ క్లిక్స్ పొందడంతో పాటు, సినిమా మీద అంచనాలను అమాంతం పెంచింది. ఈ సినిమాకి, కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు సినిమాకి ఎటువంటి పోలిక లేదని, ఈ సినిమాలో మరుగుజ్జుగా నటించే షారుఖ్ ఖాన్ ఒక్కరే హీరో అని, విభిన్నమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాని రూపొందించామని డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 21 డిసెంబర్ న విడుదల అవుతుంది.

zero-movie-pics