ఇది చంద్రబాబుకి కాదు… ఏపీ ప్రజానీకానికి అగ్నిపరీక్ష !

bjp targets on chandrababu naidu
ఢిల్లీ బేస్ గా కొద్ది నెలల ముందు నుండి చంద్రబాబు టార్గెట్ గా ఓ ఆపరేషన్ నడుస్తోంది. దానికి పేరు ఆపరేషన్ గరుడ నా, లేక మరేదన్నా నా అనే విషయం పక్కన పెడితే. ఆ ఆపరేషన్ లక్ష్యం చంద్రబాబును ఏదో విధంగా అవినీతి కేసుల్లో ఇరికించి అవినీతి మరకలు అంటించడం. తద్వారా తాము అవినీతిపరుడయిన బాబు అధికారంలో ఉండడం వల్లె నిధులు ఇవ్వలేదు అని చెప్పుకునే అవకాశం కోసం చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిన్న ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కావడం… చంద్రబాబు ప్రభుత్వం అవినితీకి ఆధారాలున్నాయని కొన్ని పత్రాలను అందించినట్లు ప్రచారం జరుగుతూండటంతో ఇది నిజమేనన్న భావన ప్రజల్లోకి వెళ్తోంది. 

గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఓ ‘మెగా’ కాంట్రాక్టర్నీ గతంలో ఢిల్లీకి పిలిపించి… చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని… ఇప్పటికే ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టేట్‌మెంట్ ప్రకారం చంద్రబాబుపై కేసులు పెడతారని కూడా భావించారు. అయితే ఎలాంటి ఫిర్యాదులు లేకుండా తమంతట తాముగా కేసు నమోదు చేస్తే రాజకీయ వేధింపులుగా భావిస్తారు. అందుకే వ్యూహాత్మకంగా ఆయనంతట ఆయనే విచారణకి ఆదేసించుకునేలా “దమ్ముంటే మీరే విచారణకు ఆదేశించుకోవాలని” చంద్రబాబుకు సవాల్ చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి అటు భారతీయ జనతా పార్టీ నేతలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్ అదే. ఒక వేళ కేంద్రమే రంగంలోకి దిగి చంద్రబాబు మీద విచారణకు ఆదేశిస్తే చంద్రబాబుకు ప్రజల సానుభూతి వస్తుంది. అందుకే వారు ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ అవినీతి రిపోర్టు అంటూ ఒక నివేదిక బాజాపా పెద్దలకు ఇచ్చినట్లు చెబుతున్నారు.  చంద్రబాబుపై ఇప్పుడు ఎలాంటి కేసులు పెట్టినా అది తెలుగుదేశంపార్టీకే ప్లస్ అవుతుంది. ఆ విషయం తెలిసి కూడా… బీజేపీ పెద్దలు… ఏదో విధంగా చంద్రబాబును కార్నర్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారని… ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఒక్క వ్యక్తి ను ఎదుర్కోవడానికి బీజీపీ… వైసేపీ మరో పక్క స్పెషల్ అపియరెన్స్ గా జనసేన ఇన్ని కలిసి కష్ట పడుతున్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేక ఇప్పుడు అవినీతి కేసులు అంటూ మొదలు పెట్టి తిమ్మిని బమ్మిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇక ఎదురవబోయే అంశాలన్నీ చంద్రబాబుకు అగ్ని పరీక్షలు అని బీజేపీ భావిస్తోంది. కానీ అవి చంద్రబాబుకు కాదు ఏపీ ప్రజానీకానికి విషమ పరీక్షలు ఎందుకంటే భావి తరాలకు ఉపయోగపడాలని చంద్రబాబు అమరావతి నిర్మాణానికి పూనుకుంటుంటే ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత మంది ఆయన్ని టార్గెట్ చేయడం ప్రజలు గమినిస్తునే ఉన్నారు.