ఆత్మహత్యకు ప్రయత్నం.. అందుకే బయటకు

Sampuranesh babu some kind of wild behavior in NTR big boss show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలాగైనా ఉండాలని అంతా ప్రయత్నిస్తుంటే బర్నింగ్‌ స్టార్‌ సంపూర్నేష్‌బాబు మాత్రం బిగ్‌బాస్‌ ఇంట్లోంచి బయట పడేందుకు పెద్ద యుద్దమే చేశాడు. సంపూర్నేష్‌బాబు గోల పడలేక సరే పో అంటూ బిగ్‌బాస్‌ పంపించాడు. ఇది మనకు కనిపించిన విషయం. అయితే కనిపించని కొత్త విషయం ఏంటి అంటే సంపూర్నేష్‌బాబు తనను పంపించకుంటే చచ్చిపోతాను అంటూ కత్తి పట్టుకుని తనను తాను గాయపర్చుకునేందుకు ప్రయత్నించాడట. కెమెరా ముందుకు వచ్చి సంపూ కాస్త గట్టిగా బెదిరించడంతో సంపూర్నేష్‌బాబును బిగ్‌బాస్‌ పంపించక తప్పలేదు అంటున్నారు. 

సంపూర్నేష్‌బాబు కాస్త వైల్డ్‌గా ప్రవర్తించడం వల్లే ఆయన్ను పంపించడం జరిగింది. మామూలుగా అయితే ఎంత కోరినా కూడా బిగ్‌బాస్‌ ఇంటి నుండి ఏ ఒక్కరిని పంపించడం జరగదు. సంపూ షో మద్యలోనే వెళ్లి పోవడంతో ఆయనకు ఈ షోకు సంబంధించి ఒక్క పైసా కూడా పారితోషికం అందదు. అదే సమయంలో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సంపూర్నేష్‌బాబు లీగల్‌ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని వారాల పాటు సంపూర్నేష్‌బాబు ఉండి ఉంటే బాగుండేది. మరీ రెండవ వారంలోనే సంపూ బయటకు వెళ్లి పోయిన నేపథ్యంలో షోపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్వాహకులు ఏం చేస్తారు అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

‘గౌతమ్‌నంద’కు ఆమె అందాలు ప్లస్‌

ఛార్మి ముందు ఉంచే ప్రశ్నలు ఇవే

నందమూరి, నాని కాంబో..!